ఎగుమతిదారులకు పెద్ద ఊరట

10 Sep, 2021 01:23 IST|Sakshi

రూ.56,027 కోట్లను విడుదల చేయనున్న కేంద్రం

వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు అపరిష్కృతంగా ఉన్న పన్ను రిఫండ్‌ (తిరిగి చెల్లింపులు) రూ.56,027 కోట్ల మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. 45,000 మందికి పైగా ఎగుమతిదారులకు ఈ మొత్తం ఈ ఏడాదే అందనున్నట్టు చెప్పారు. పలు ఎగుమతి ప్రోత్సాహకాల పథకాల కింద (ఎంఈఐఎస్, ఎస్‌ఈఐఎస్, ఆర్‌వోఎస్‌సీటీఎల్, ఆర్‌వోఎస్‌ఎల్, ఆర్‌వోడీటీఈపీ) ఈ మొత్తం ఎగుమతిదారులకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. 2021–22లోనే ఇందుకు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతులకు ఉన్న డిమాండ్‌ను చేరుకునేందుకు, నగదు ప్రవాహాలు పెరిగేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. ఇది రానున్న నెలల్లో బలమైన వృద్ధికి సైతం సాయపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు