15 వరకే ఎయిరిండియా గడువు

9 Sep, 2021 02:15 IST|Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి బిడ్స్‌ దాఖలు గడువు ఈ నెల 15తో ముగియనున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాథమిక బిడ్స్‌ దాఖలుకు ఇంతవరకూ ఐదుసార్లు గడువును పొడిగించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. గతేడాది డిసెంబర్‌లో టాటా గ్రూప్‌సహా పలు కంపెనీలు ప్రాథమిక బిడ్స్‌ దాఖలు చేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి అర్హత సాధించిన కంపెనీలకు వర్చువల్‌ డేటా రూమ్‌(వీడీఆర్‌) ద్వారా తగిన సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది. ప్రాథమిక బిడ్స్‌ విశ్లేషణ తదుపరి ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఫైనాన్షియల్‌ బిడ్స్‌కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. వీటికి సెపె్టంబర్‌ 15 వరకూ గడువును ప్రకటించింది. గడువు ముగిశాక ప్రభుత్వం రిజర్వ్‌ ధరపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా భారీ నష్టాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఎయిరిండియా విక్రయం డిసెంబర్‌ చివరికల్లా పూర్తయ్యే వీలున్నట్లు వివరించాయి.

మరిన్ని వార్తలు