వ్యవసాయం, చిన్న పరిశ్రమలకోసం పీఎన్‌బీ క్యాంపులు

5 Oct, 2020 06:27 IST|Sakshi

ఎండీ ఎస్‌.ఎస్‌.మల్లికార్జునరావు

హైదరాబాద్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) ఆధ్వర్యంలో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని బ్యాంకు ఎండీ ఎస్‌.ఎస్‌.మల్లికార్జునరావు తెలిపారు.  ’గ్రామ్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. గాంధీ జయంతి నాడు ఒకే  రోజున దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లో 526 గ్రామాల్లో క్యాంపులు చేపట్టి వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులు, గృహనిర్మాణ దారులకు రుణాలపై అవగాహన కల్పించామన్నారు. 4 వేల గ్రామీణ బ్రాంచీల ద్వారా డిసెంబర్‌ 31 నాటికి 25 గ్రామాల్లో క్యాంపులు పెట్టాలని నిర్ణయించామన్నారు. కేంద్ర పథకాల సద్వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్,క్రెడిట్, సోషల్‌ సెక్యూరిటి, ఆధార్‌ సీడింగ్, మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ వంటి కార్యక్రమాలపై క్యాంపులో అవగాహన కల్పిస్తామని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో 141, ఆంధ్రప్రదేశ్‌లో 137 పంజాబ్‌ నేషనల్‌ శాఖలు ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు