గృహపూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో హోం లోన్‌

10 Sep, 2021 11:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబైకి చెందిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ శ్రీరామ్‌ (ఎస్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నెలకు రూ.110 కోట్ల వ్యక్తిగత గృహ రుణాలను పంపిణీ చేయాలని లక్క్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా ‘గృహ పూర్తి’ పేరిట అందుబాటు గృహాల రుణ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 

సగటున రూ. 12 లక్షలు
గృహపూర్తి లోన్ల సగటు టికెట్‌ పరిమాణం రూ.12–15 లక్షలుగా ఉంటుందని కంపెనీ ఎండీ అండ్‌ సీఈఓ రవి సుబ్రమణియన్‌ తెలిపారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో రూ.1,400  కోట్ల రుణాలను అందించామని, వచ్చే రెండేళ్లలో రూ.2,500 కోట్ల అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం)ను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు చెప్పారు. 

విస్తరణ బాటలో
ఏపీ, తెలంగాణ మార్కెట్లలో అతిపెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో పలు ఉత్పత్తులను తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 350 మంది ఉద్యోగులను నియమించుకోవటంతో పాటు ప్రస్తుతం 11 శాఖలుండగా.. వాటిని 178కి విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌కు 15 రాష్ట్రాలలో 84 బ్రాంచీలున్నాయి. రూ.4 వేల కోట్ల ఏయూఎం ఉండగా.. తెలుగు రాష్ట్రాల వాటా 13 శాతంగా ఉంది.  

చదవండి: దశాబ్దం కనిష్టానికి కోటక్‌ మహీంద్రా గృహ వడ్డీ

మరిన్ని వార్తలు