2022 జీఎస్టీ బాదుడుతోనే షురూ! చెప్పుల నుంచి ఫుడ్‌ డెలివరీల దాకా..

1 Jan, 2022 14:08 IST|Sakshi

న్యూయర్‌ ప్రారంభం నుంచి కస్టమర్లకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ షాకిచ్చాయి. నేటి నుంచి (జనవరి1) నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టే ప్రతి కస్టమర్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ 5శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. దీంతో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టే కస్టమర్‌లకు ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ విధిస్తున్న జీఎస్టీ మరింత భారం కానుంది.

 

గతంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు  రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు.

అలాగే  ఓలా,ఊబర్‌ వంటి రైడ్‌ షేరింగ్‌ సర్వీసుల్లో సైతం జీఎస్టీని విధించాయి. జనవరి 1నుంచి బైక్‌, ఆటో బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ప్రతి రైడ్‌ పై అదనంగా మరో 5శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్‌, ఇతర ఆటోలు కాకుండా కేవలం రైడ్‌ షేరింగ్‌ కంపెనీలైన ఓలా, ఊబర్‌ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. 

దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు జనవరి  అమల్లోకి వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది.

ఇక వీటితో పాటు ధరలతో సంబంధం లేకుండా  ఫుట్‌ వేర్‌ పై నేటి నుండి 12 శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. 

చదవండి: కోల్గేట్‌ పేస్ట్‌ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..

మరిన్ని వార్తలు