జీఎస్‌టీ వసూళ్లు అదుర్స్‌..నవంబరులో రూ.1.46 లక్షల కోట్లు

2 Dec, 2022 07:24 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి.  వినియోగ వ్యయాల దన్నుతో నవంబర్‌లో 11 శాతం పెరిగి (2021 నవంబర్‌తో పోల్చి) రూ.1,45,867 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్‌టీ వసూళ్లు రూ.1.4 లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి.  కాగా,  ఆగస్టు తర్వాత తక్కువ వసూళ్లు జరగడం నవంబర్‌లోనే మొదటిసారి. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు విభాగాల వారీగా.. 

►సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.25,681 కోట్లు 

►స్టేట్‌ జీఎస్‌టీ రూ.32,651 కోట్లు 

►ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.77,103 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.38,635 కోట్లుసహా).  

►సెస్‌ రూ.10,432 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.817 
కోట్లతో సహా) 

►‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్‌టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు