కేంద్రం కీలక నిర్ణయం, వీటి ధరలు పెరగనున్నాయా?

18 Dec, 2022 15:24 IST|Sakshi

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్నీ రాష్ట్రాల్లో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌పై ఒకే విధమైన పన్ను విధించాలని భావిస్తోంది. ఈ కొత్త మార్గ దర్శకాలు అమల్లోకి వస్తే ఎస్‌యూవీ వెహికల్స్‌ ధరలు పెరగడంతో పాటు ఆ వెహికల్స్‌పై అధిక పన్ను కట్టాల్సి ఉంటుంది. 

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 48వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో 15 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం 8 అంశాలపై చర్చలు జరిపి అసంపూర్ణంగా ముగించారు. అయితే ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్ధిక మంత్రి, కౌన్సిల్‌ సభ్యులు ఎంయూవీ, ఎస్‌యూవీగా పరిగణలోకి తీసుకోవాలంటే కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు ఉండాలని సూచించారు.

ఎస్‌యూవీ అంటే?
వాటిలో ఎస్‌యూవీకి ఈ ప్రమాణాలు ఉంటేనే ఆ వెహికల్‌ను ఎస్‌యూవీగా నిర్ధారించాల్సి ఉంటుందని వెల్లడించారు. కార్‌ ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీకి మించి ఉండాలి.వాహనం పొడవు 4000 మిమీల కన్నా ఎక్కువ ఉండాలి.170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. 

ఈ  ప్రమాణాలు ఉంటేనే అవి ఎస్‌యూవీ వెహికల్స్‌ అని స్పష్టం చేసింది. ఈ వాహనాలపై 28శాతం జీఎస్టీ, 22శాతం సెస్‌తో మొత్తంగా 50శాతం పన్ను విధించాలని ఆదేశించింది. కాగా, ఆర్ధిక శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇతర వాహనాలపై అసెస్‌మెంట్‌ 22శాతం చెల్లించాలనే విషయంపై సెంట్రల్‌ అండ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ అథారిటీ (ఫిట్‌మెంట్‌ కమిటీ) సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  
 
జీఎస్టీ అంటే ఏమిటి?
జీఎస్టీ అంటే గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అని అర్ధం 

జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌కు అధ్యక్షత వహించేది ఎవరు? 
కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగింది.

మరిన్ని వార్తలు