చేనేతకు ఊరట.. జీఎస్‌టీ పెంపు నిర్ణయం వాయిదా

31 Dec, 2021 13:29 IST|Sakshi

న్యూఢిల్లీ: చేనేత వస్త్రాలపై పన్నులు పెంచే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జీఎస్‌టీ పెంపు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశం నలుమూలల విమర్శలు రావడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. దీంతో చేనేత వస్త్రాలపై జీఎస్‌టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే విషయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది.

వాయిదా
న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం 2021 డిసెంబరు 31 జరుగుతోంది. ఈ సమావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ సభ్యులందరూ టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ పెంచడం సరికాదంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షలు జీఎస్‌టీ పెంపుపై విమర్శలు ఎక్కు పెట్టాయి. దీంతో టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని వార్తలు