కోవిడ్‌ ఔషధాల ధరలు తగ్గేనా?

11 Jun, 2021 08:12 IST|Sakshi

రేపు జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ! 

కోవిడ్‌ ఔషధాలపై పన్ను తగ్గింపు అంశం చర్చ!

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జూన్‌ 12వ తేదీన అత్యున్నత స్థాయి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కోవిడ్, బ్లాక్‌ ఫంగస్‌ ఆవశ్యక ఔషధాలపై పన్నులను తగ్గించే అంశంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించనున్నదని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ కౌన్సిల్‌లో రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉంటారు.

మే 28
కోవిడ్‌ ఔషధాల తగ్గింపు మే 28వ తేదీన జీఎస్‌టీ మండలి సమావేశం జరిగింది. కోవిడ్‌ ఔషధాల ధర తగ్గింపుపై ఆ సమావేశంలో చర్చించినా ... ఏకాభిప్రాయం రాకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇదే అంశం ప్రధానంగా సమావేశం కానుంది. 

ధరలు తగ్గుతాయి
పీపీఈ కిట్లు, మాస్క్‌లు , వ్యాక్సిన్లుసహా కోవిడ్‌ ఆవశ్యక ఔషధాలకు పన్ను రాయితీ అంశాలపై సిఫారసులు చేయడానికి మంత్రిత్వ స్థాయి గ్రూప్‌ (జీఓఎం) ఏర్పాటైంది.  దేశీయ తయారీ వ్యాక్సిన్లపై ప్రస్తుతం 5 శాతం జీఎస్‌టీ ఉంది. కోవిడ్‌ మందులు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేషన్‌లపై ఈ రేటు 12 శాతంగా ఉంది. జీఎస్‌టీ తొలగిస్తే వీటి ధరలు తగ్గుతాయి. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు