క్యాసినోలు,ఆన్‌లైన్‌ గేమ్స్‌పై 28 శాతం జీఎస్‌టీ?

27 Jun, 2022 08:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలపై 28 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈ వారంలో సమావేశమయ్యే జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయించనుంది. చండీగఢ్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో జీఎస్‌ట్‌ కౌన్సిల్‌ భేటీ కానుంది. 

ఆన్‌లైన్‌ గేమింగ్‌ను యూజ ర్‌ చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై పన్ను విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్‌సంగ్మ అధ్యక్షతన మంత్రుల గ్రూపు సిఫా రసు చేసింది. రేస్‌ కోర్స్‌లకు బెట్టింగ్‌ పూర్తి విలువపై విధించాలని సూచించింది. అదే క్యాసినోలు అయితే ఆడేవారు కొనుగోలు చేసే చిప్స్‌/కాయిన్స్‌ విలువపై విధించాలని సిఫారసు చేసింది. ఇలా అన్ని రకాల ఫీజులు, చార్జీలు, పందెం విలువపై 28 శాతం జీఎస్‌టీ రేటును మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. 

ఆహారం, పానీయాలపైనా ఇదే పన్ను రేటు వర్తించనుంది. అంటే స్థూల విలువపై పన్ను ఉండాలన్నది మంత్రుల గ్రూపు ప్రతిపాదన. ప్రస్తుతం ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 18% జీఎస్‌టీ అమలవుతోంది. కానీ, పరిశ్రమ మాత్రం పన్ను పెంపును వ్యతిరేకిస్తోంది.   

మరిన్ని వార్తలు