GST Rate: జీఎస్టీ బాదుడు, మరింత ఖరీదుగా నిత్యావసర వస్తువులు!

30 Jun, 2022 10:26 IST|Sakshi

రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం ముగిసింది. చండీగఢ్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ కొత్త పన్ను రేట్లను విధించింది. విధించిన ఆ పన్ను రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానుండగా..ఏ వస్తువులపై ఎంత ట్యాక్స్‌ విధించారో తెలుసుకుందాం.     

 నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వంటింట్లో విరివిరిగా వినియోగించే ప్యాకింగ్‌,లేబుల్‌ వేసిన పాలు,పెరుగు, చేపలపై 5శాతం జీఎస్టీ, బ్యాంక్‌ ఖాతాదారులకు అందించే చెక్‌ బుక్‌లపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. 

వీటితో పాటు రూ.1000 కంటే తక్కువ ఉన్న హోటల్‌ గదులపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో హోటల్‌ రూమ్స్‌పై జీఎస్టీ లేదు. 

రూ.5వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న హాస్పిటల్‌ రూమ్స్‌లో ఉంటే వాటిపై 5శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంది. గతంలో హాస్పిటల్‌ రూమ్స్‌పై ఎలాంటి జీఎస్టీ లేదు. తాజాగా హాస్పిటల్‌ రూమ్స్‌ పై పన్ను వసూలు చేయడంపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ఎండు చిక్కుళ్లు, మకనా, గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, సేంద్రీయ ఆహారం, కంపోస్ట్‌ ఎరువుపై 5 శాతం జీఎస్టీ

సోలార్‌ వాటర్‌ హీటర్‌,లెదర్‌ ప్రొడక్ట్‌లపై 5 శాతం నుంచి 12శాతం జీఎస్టీ పెంపు 

ప్రింటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌, ఎల్‌ఈడీ బల్బులు, డ్రాయింగ్‌ చేసేందుకు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్(ఉదా: డ్రాఫ్టింగ్‌ బోర్డ్‌, డ్రాఫ్టింగ్‌ మెషిన్‌, రూలర్స్‌, టెంప్‌లెట్స్‌, కంపాస్‌) బ్రేడ్లు,స్పూన్లు, ఫోర్క్‌లపై విధించే పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

తగ్గేవి ఇవే

ఆర్ధోపెడిక్‌ ఉపకరణాలపై 12నుంచి 5శాతానికి పన్ను తగ్గింపు  

ట్రాన్స్‌ పోర్ట్‌ గూడ్స్‌, రోప్‌ వేస్‌ పై 18శాతం నుంచి 5శాతానికి  కుదింపు 

ఇంధనం ధర కలిపి అద్దెకు తీసుకునే ట్రక్‌, సరుకు రవాణా వాహనాల అద్దెపై పన్ను తగ్గింపు 
 

చదవండి👉 సామాన్యులకు కేంద్రం భారీ షాక్..

మరిన్ని వార్తలు