కొత్త ఇల్లు కొంటున్నారా? అయితే, వర్షంలోనే వెతకండి.. ఎందుకంటే?

9 Jul, 2022 13:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వర్షంలో బయటికి వెళ్లాలంటే కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు.

గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతాయి. వర్షం నీరు వెళ్లే చోటు లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది.

ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్‌ స్టాండ్‌ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది.  

చదవండి: దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే!

మరిన్ని వార్తలు