ఇండియన్‌ టెక్కీలకు ఊరట.. హెచ్‌-1బీ వీసాలపై యూఎస్‌ కోర్ట్‌ కీలక తీర్పు

30 Mar, 2023 14:20 IST|Sakshi

అమెరికాలోని ఇండియన్‌ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్‌-1బీ వీసాలపై యూఎస్‌ కోర్ట్‌ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్‌లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

కొన్ని వర్గాల హెచ్‌-1బీ వీసా హోల్డర్‌ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని  యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది.

(ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఇక పదేళ్లూ అంతంతే!)

సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్‌-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్‌ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్‌ ఆథరైజేషన్‌ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు.

హెచ్‌-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్‌ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ తెలిపింది.

(గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?)

మరిన్ని వార్తలు