‘కిక్కు’ కోసం వేల కోట్ల చోరీ? కరిగిపోయి ఏం చేశారంటే..

12 Aug, 2021 12:29 IST|Sakshi

Hackers Returning Crypto: డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో అతి పెద్ద చోరీగా చెప్పుకుంటున్న పాలి నెట్‌వర్క్‌ హ్యాకింగ్‌ విషయంలో  ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి క్షణాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసిన హ్యాకర్లు. ఆ తర్వాత ఎందుకనో మెత్తపడ్డారు. అందులో దాదాపు సగం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. 

హ్యాకింగ్‌లో కొత్త రికార్డు
పటిష్టమైన భద్రతా వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్‌చైయిన్‌ ఫ్లాట్‌ఫామ్‌పై నడిచే డీఫై యాప్‌ పాలినెట్‌వర్క్‌ను ఇటీవల హ్యాక్‌ అయ్యింది. సైబర్‌ నేరగాళ్లు ఈ యాప్‌ నుంచి ఏకంగా 611 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 12 వేల కోట్ల రూపాయల విలువైన  క్రిప్టో కరెన్సీని కొట్టేశారు. పాలినెట్‌వర్క్‌ నుంచి తమకు అనుకూలమైన ఖాతాలకు క్రిప్టో కరెన్సీని తరలించుకుపోయారు. క్షణాల్లో జరిగిన ఈ మెరుపు హ్యాకింగ్‌తో బిత్తరపోయిన పాలి నెట్‌వర్క​ ఆ తర్వాత తేరుకుంది. కొన్ని వేల మందికి సంబంధించిన డిజిటల్‌ కరెన్సీని కొట్టేయడం సరికాదని... దయ ఉంచి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ హ్యాకర్లను సోషల్‌ మీడియా వేదికగా హ్యాకర్లను పాలిగాన్‌ నెట్‌వర్క్‌ కోరింది.

హ్యాకర్ల మంచి మనసు
పాలిగాన్‌ నెట్‌వర్క్‌ చేసిన విజ్ఞప్తికి హ్యాకర్లు స్పందించారు. తాము దారి మళ్లించిన సొత్తులో కొంత భాగాన్ని పాలి నెట్‌వర్క్‌ సూచించిన ఖాతాలో జమ చేశారు.  కొట్టేసిన సొత్తులో 260 మిలియన్‌ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్‌ 3.3 మిలియన్‌ డాలర్లు, బినాన్స్‌ స్మార్ట్‌ కాయిన​‍్లు  256 మిలియన్లు, పాలిగాన్‌ 1 మిలియన్‌ డాలర్లు ఉన్నాయంటూ పాలినెట్‌ వర్క్‌ ప్రకటించింది. హ్యాకర్లు విడదల వారీగా సొమ్మును పాలిగాన్‌ నెట్‌వర్క్‌కి తిరిగి బదిలీ చేస్తున్నారు. 

డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌
సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్‌ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్‌డ్‌ ఫైనాన్స్‌ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్‌ చెయిన్‌ అనే ఆర్టిఫీయల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్‌ అంటే డీ సెంట్రలైజ్డ్‌ యాప్‌ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్‌ డీఫై యాప్‌ హ్యాకింగ్‌కి గురైంది.

మరిన్ని వార్తలు