చిన్న సిటీలకు చిట్టి విమానం, రివ్వున ఎగిరేందుకు రెడీ

26 Sep, 2021 17:02 IST|Sakshi

ద్వితీయ శ్రేణి నగరాలు జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తొలి చిన్న విమానం గాలిలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. 

హల్‌ ఆధ్వర్యంలో
విమానయాన రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర రాజధానులే కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే నిర్ణయంతో ఉంది. అందులో భాగంగా తక్కువ రన్‌ వేలో టేకాఫ్‌, ల్యాండ్‌ అయ్యేలా సివిల్‌ డూ 228 (డార్నియర్‌ 228)  విమానాలను హిందుస్తాన్‌ ఎయిరోనాటిక్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సంస్థ రూపొందిస్తోంది. కాన్పూరులో ఈ విమానాలను తయారీ జరుగుతోంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో
పూర్తిగా కొండ ప్రాంతాలతో నిండి ఉండే అరుణాచల్‌ ప్రదేశ్‌లో తొలిసారిగా ఈ విమానాలను సివిల్‌ ఏవియేషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు హల్‌, సివిల్‌ ఏవియేషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఆర్మీ ఆధ్వర్యంలో ఈ విమానాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిర్‌ అంబులెన్సులుగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి.

పలు రకాలుగా
హల్‌ తయారు చేస్తోన్న సివిల్‌ డూ 228 విమనాల్లో 19 మంది ప్రయాణించవచ్చు. మెయింటనెన్స్‌ ఖర్చు తక్కువ. ప్రయాణికుల రవాణాతో పాటు వీఐపీ ట్రాన్స్‌పోర్ట్‌, ఎయిర్‌ అంబులెన్స్‌, ఫ్లైట్‌ ఇన్స్‌పెక‌్షన్‌, క్లౌడ్‌ సీడింగ్‌, ఫోటోగ్రఫీ, రిక్రియేషన్‌ యాక్టివిటీస్‌కి ఉపయోకరంగా ఉంటుంది. 

త్వరలో
వరంగల్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, రామగుండం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీఎంఆర్‌ ఒప్పందాల నుంచి మినహాయింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది, ఈ విషయాల్లో క్లారిటీ వస్తే జిల్లా కేంద్రాల నుంచి రివ్వున ఎగిరేందుకు డూ 228 విమానాలు రెడీ అవుతున్నాయి.  

చదవండి : ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ

మరిన్ని వార్తలు