ఆ నమ్మకమే.. ఆయన్ని ఈ వయసులోనూ ‘కింగ్‌’గా నిలబెట్టింది

11 Oct, 2021 13:15 IST|Sakshi

Happy Birthday Amitabh Bachchan: నటనలో కొందరు అరుదు. అంటే వయసు మీద పడినా..  వాళ్ల మీద జనాల అభిమానం మాత్రం తగ్గదు.  పైగా వాళ్ల ఛరిష్మా.. ఏ జనరేషన్‌ను అయినా ఇట్టే ఆకట్టుకోగలుగుతుంది. అలాంటి తారల్లో ముందు వరుసలో ఉంటారు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌.  అందుకే ఇప్పటి మార్కెట్‌లోనూ ఎండార్స్‌మెంట్‌ కింగ్‌గా రాణించగలుగుతున్నారు ఆయన. 

అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు ఇవాళ(అక్టోబర్‌ 11).  తన 79వ పుట్టినరోజు సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఓ పాన్‌ మసాలా బ్రాండ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డబ్బుల్ని సైతం వెనక్కి ఇచ్చేసిన ఆయన.. ఇది Surrogate advertising( నిషేధించిన అడ్వైర్‌టైజ్‌మెంట్‌) జాబితాలో ఉందని తెలియక ఒప్పుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. 


సాధారణంగా తారలు తమ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం Surrogate advertisementsలోనూ కనిపిస్తుంటారు. అయితే అమితాబ్‌ మీద జనాల్లో ఓ నమ్మకం ఉందని,  దానిని చెడగొట్టుకోవద్దని నేషనల్‌ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్‌(నాటో) సంస్థ కోరింది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా! అందుకే వైదొలిగినట్లు ప్రకటించారు.   


ఆ నమ్మకమే.. 

బాలీవుడ్‌ మెగాస్టార్‌
లెజెండెస్‌ ఆఫ్‌ ఆల్‌టైం.. 
ఎవర్‌గ్రీన్‌ ‘యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌’ ఆఫ్‌ బాలీవుడ్‌
 
బాలీవుడ్ షెహన్‌షా.. ఇలా ఏ పేర్లతో పిలుచుకున్నా సరే.. అమితాబ్‌ అంటే దేశం మొత్తానికి ఓ అభిమానం ఉంది. 


‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై’..  సాధారణంగా యంగ్‌ సెలబ్రిటీకి ఎండార్స్‌మెంట్‌ మార్కెట్‌ రెడ్‌కార్పెట్‌ పరుస్తుంటుంది. అలా కాకుండా ఎనిమిది పదుల వయసు దగ్గరపడుతున్నా..  ఎండార్స్‌మెంట్‌ కింగ్‌గా ఆయన కొనసాగడం మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. అందుకు కారణాలేంటో చూద్దాం. 


►సినిమాకు సంబంధించి మాత్రమే కాదు.. సాధారణ సొసైటీలోనూ అమితాబ్‌ ప్రభావం ఎక్కువే. 

►ఆయన యాడ్స్‌ల్లో పిల్లలకు ఏదైనా చెబితే ఇంట్లో తాత చెప్పినట్లే ఉంటుంది. 

►ఓ తండ్రిగా, ఓ పెద్దన్నగా,  ఓ మామగా, ఊరికి ఓ పెద్దమనిషిగా..  ఆయన ఏం చెబితే అంతా వింటారనే నమ్మకం మార్కెట్‌లో క్రియేట్‌ అయ్యింది. 

►ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌(IIHB) ఇచ్చిన టియారా(Trust, Identify, Attractive, Respect and Appeal) నివేదికలో బిగ్‌ బీ ఫస్ట్‌​ ప్లేస్‌లో నిలిచారు.

►దేశంలో వందకి 88 మంది..  అమితాబ్‌ చేసే బ్రాండింగ్‌ను నమ్ముతామని చెప్పారు 

►ఆయన ఇచ్చే ప్రకటనలు నమ్మశక్యంగా ఉంటాయని తేల్చారు వాళ్లంతా. 

►హుందాగా ఆయన చేసే యాడ్‌ ఏదైనాసరే.. భాషతో సంబంధం లేకుండా జనాల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది

►అమితాబ్‌ ఒక్కో కమర్షియల్‌యాడ్‌కు తీసుకునే రూ.5 నుంచి 8 కోట్ల మధ్య(స్టార్టప్‌టాకీ ప్రకారం) తీసుకుంటారట!

►పిల్లలు ఇష్టపడే మ్యాగీ నుంచి వాళ్ల ఆరోగ్య భద్రత కోసం పోలియో వ్యాక్సిన్‌ ప్రచారం దాకా, క్యాడబరీ చాక్లెట్‌ నుంచి నగల దాకా, హెల్త్, స్పోర్ట్స్‌, ఫుడ్‌, ఈ-కామర్స్‌, వెహికిల్స్‌.. ఇలా అన్ని యాడ్స్‌లోనూ అమితాబ్‌ మార్క్‌ కనిపిస్తుంటుంది. 

►ఐరాసకు సంబంధించిన పలు విభాగాలకు అంబాసిడర్‌గా..  స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, పొలియో వ్యాక్సిన్‌ లాంటి ప్రభుత్వ ప్రచారాలకు సైతం అమితాబ్‌ పెద్దరికం తోడవుతోంది.

► వివాదాలకు దూరంగా ఉండే అమితాబ్‌.. ఎండార్స్‌మెంట్‌ల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని భావించారు. అందుకే ఆ పాన్‌ మసాలా యాడ్‌ నుంచి వైదొలిగారు.

HBDAmitabhBachchan.. సెలబ్రిటీల ట్వీట్లు కొన్ని..

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు