బయో ఇంధన కూటమికి డిమాండ్‌ చేస్తాం: కేంద్ర మంత్రి 

30 Nov, 2022 13:02 IST|Sakshi
పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి (ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్‌ కూటమి విజయం సాధించిన మాదిరే.. అంతర్జాతీయంగా బయో ఇంధన కూటమి కోసం ప్రయత్నిస్తామని పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ఇందుకు జీ20 నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేపీఎంజీ ఎన్‌రిచ్‌ 2022 సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు.

బయో ఇంధనాలను వినియోగిస్తున్న బ్రెజిల్‌ నుంచి అమెరికా తదితర దేశాలతో కూడిన కూటమి.. బయో ఇంధనాలకు సంబంధించి ప్రమాణాలను రూపొందించడం, ఇంజన్లు, టెక్నాలజీ సహకారం దిశగా కృషి చేస్తుందన్నారు. భారత్‌ ఇప్పటికే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ లక్ష్యాన్ని 2030కు బదులు 2024–25 నాటికే  సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీ20లో భాగంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, చైనా తదిత దేశాలు బయో ఇంధనాలను తయారు చేస్తుండడం గమనార్హం.  (అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!)

మరిన్ని వార్తలు