త్వరలో మార్కెట్లోకి హ్యార్లీ డేవిడ్సన్ సూపర్ ఎలక్ట్రిక్ బైక్స్

12 May, 2021 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఇందన ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. కొద్దీ కాలం నుంచే ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ విషయంలో పెద్ద పెద్ద కంపెనీలు అటు వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ హ్యార్లీ డేవిడ్సన్ కూడా వచ్చి చేరింది. అయితే, వినియోగదారులు మాత్రం స్టైల్ విషయంలోనూ, వాల్యూ ఫర్ మనీ వంటి ఆకట్టుకునే వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ లైవ్ బ్రాండెడ్ సూపర్ మోటార్ సైకిల్ ను జులై8న జరిగే అంతర్జాతీయ మోటార్ సైకిల్ షోలో దీనిని ప్రదర్శించనున్నట్లు అధికారిక వెబ్ సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ లైవ్ వైర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద వచ్చే అన్నీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో అందించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని జోచెన్ ప్రకటనలో తెలిపారు. ఈ నూతన బ్రాండ్ మొదట అర్బన్ బైక్స్ పై దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. హార్లీ డేవిడ్సన్ కు వచ్చే లాభంలో ఎక్కువ భాగం స్మాలర్, లైటర్ మోడళ్ల బైక్స్ కంటే సుదూర క్రూయిజర్లే ఆక్రమించాయి అని అన్నారు. దీని ధర వచ్చేసి 29,799 డాలర్ల(రూ.21,88,825.95 లక్షలు) నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలియదు. హ్యార్లీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న జోచెన్ అసలు సిసలైన విద్యుత్ మోటార్ సైకిల్ తయారీకి శ్రీకారం చుట్టారు.

చదవండి:

కోవిడ్‌లోనూ కొనుగోళ్లు, విలీనాల జోష్‌

మరిన్ని వార్తలు