హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్‍తో

9 Mar, 2023 11:31 IST|Sakshi

పాపులర్ అమెరికన్ బైక్‌ తయారీ కంపెనీ హార్లే-డేవిడ్‌సన్, చైనీస్ దిగ్గజం కియాన్‌జియాంగ్ మోటార్‌సైకిల్‌తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో తక్కువ సామర్థ్యం కలిగిన బైక్ మోడల్ అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా పుట్టుకొచ్చిన X350 రేపు (మార్చి 10) మార్కెట్లో విడుదలకానుంది.

హార్లే-డేవిడ్సన్ చైనీస్ మార్కెట్లో ఎక్స్350 బైకుతో పాటు, ఎక్స్500 బైకుని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ బైకులో (ఎక్స్500) ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ బైకుల్లో వి-ట్విన్ ఇంజిన్ లేకపోవడం గమనార్హం. దీని స్థానంలో లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు.

ఈ బైకుల డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. నియో రెట్రో రోడ్‌స్టర్ స్టైలింగ్‌ ఇప్పుడు చూడవచ్చు. ఎల్ఈడీ లైటింగ్స్, యుఎస్‌డీ ఫోర్క్, ఆఫ్‌సెట్ మోనోషాక్ సెటప్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా చిన్న డిజిటల్ ఇన్‌సెట్‌తో అనలాగ్ స్పీడోమీటర్ కూడా అందుబాటులో ఉంటుంది. 

రెండు బైక్‌లు హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ లైనప్‌లో జాబితా చేయబడ్డాయి. కావున భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా విక్రయించబడే అవకాశం ఉంది, ప్రస్తుతం ఈ కొత్త బైకులు చైనీస్ మార్కెట్లో మాత్రమే విడుదలవుతాయి, భారతదేశంలో ఈ బైకుల లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరిన్ని వార్తలు