ఈ విషయంలో మన వంతు బాధ్యత నెరవేర్చాల్సిందే

8 Jun, 2022 14:05 IST|Sakshi

ఇటీవల ఇంటర్నెట్‌లో ఓ ఫోటో బాగా పాపులర్‌ అయ్యింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన ఈ బోర్డు ఎంతో మందిని ఆలోచనలో పడేంది. అలాంటి వారిలో సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే హర్ష్‌ గోయెంకా కూడా ఉన్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ ఫోటోకు తనవంతు సమాచారం జోడించి మరింత అర్థవంతంగా మార్చారు. అంతేకాదు ఆ సబ్జెక్టుపై మనం నిర్వర్తితంచాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేశారు.

ఇంతకీ నెట్టింట వైరల్‌గా మారిన టీసీఎస్‌ క్యాంటీన్‌కి సంబంధించిన సదరు ఫోటోలో.. తినడానికి ఎన్ని ఐటమ్స్‌ కావాలో అన్ని తీసుకోండి. కానీ తీసుకున్న ఐటమ్స్‌ని పూర్తిగా తినండి. వృధా చేయకండి. క్రితం రోజు ఇలా వృధా అయిన ఆహారం 45 కేజీలు. దీంతో ఒక 180 మందికి భోజనం పెట్టవచ్చంటూ వివరించారు. 

ఈ ఫోటోకు హార్ష్‌ గోయెంకా మరింత సమాచారం అందిస్తూ ... హోటల్‌ ఇండస్ట్రీలో ఏటా 3000 మిలియన్‌ టన్నుల ఆహారం వృధా అవుతోందంటూ తెలిపారు. ఆహారం తయారీదారు నుంచి అమ్మకందారు తినేవాళ్ల వరకు అందరూ ఎంతో కొంత తినదగిన పదార్థాలను చెత్తకుండీ పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది తిండికి అల్లల్లాడుతుంటే మరోవైపు ఇంత వృధా చేయడం సరైన పనా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మనమంతా ఏదో ఒకటి చేయాలంటూ సూచించారు హార్ష్‌ గోయెంకా.

చదవండి: బిల్‌గేట్స్‌ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా?

మరిన్ని వార్తలు