'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!

2 May, 2022 14:11 IST|Sakshi

చైనాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. 2019 తరువాత మళ్లీ తీవ్రస్థాయిలో విలయ తాండవం చేస్తోంది.దాన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభ్వుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రముఖులుండే బీజింగ్‌ నగరంలోని అన్నీ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించింది. థీమ్‌ పార్క్‌ యూనివర్సల్ స్టూడియోను షట్‌ డౌన్‌ చేసింది.  

గత తొమ్మిది రోజుల్లో 350 కేసులు నమోదు కావడంతో జిన్‌ పింగ్‌ ప్రభుత్వం బీజింగ్‌ ప్రజలపై ఆంక్షలు విధించింది. షాంఘై తరహాలో..బీజింగ్‌లో కరోనా కేసులు నమోదైన భవనాలు, గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హాలిడేస్‌ కావడంతో జిమ్‌లు, థియేటర్లను సైతం స్థానిక అధికారులు మూసివేశారు. గ్రేట్ వాల్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించే సందర్శకులు గడిచిన 48 గంటలలోపు కోవిడ్‌ రిపోర్ట్‌ను చూపించాల్సి ఉండగా..ఇప్పుడు చైనాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో భారత వ్యాపార వేత్త హర్ష గోయెంకా సెటైరికల్‌గా స్పందించారు.  

'చైనాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని నేను హర్షానంద స్వామిని అడిగాను. వైరస్‌ అలసిపోయింది. అందుకే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలనుకుంటుంది. అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు,  కరోనా (చైనాను మినహాఇస్తే) తగ‍్గడంతో ఇన్నిరోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. ఇప్పుడు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. పై అంశాలనే ప్రస్తావిస్తూ హర్ష్‌ గోయాంక్‌ సరదా ట్వీట్‌ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి👉 అరెభాయ్‌.. బయటకురా.. వర్క్‌ ఫ్రం హోంపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు స్పందన

మరిన్ని వార్తలు