ఒకే ఫ్రేమ్‌లో ఈలాన్‌ మస్క్‌, జెఫ్‌బేజోస్‌.. హార్ష్‌ ఆకట్టుకునే వ్యాఖ్య

16 May, 2022 12:53 IST|Sakshi

ఈలాన్‌మస్క్‌, జెఫ్‌బేజోస్‌లో స్టార్టప్‌లతో తమ కెరీర్‌ ప్రారంభించి ప్రపంచంలోనే అతి పెద్ద కార్పోరేట్‌ కంపెనీలకు యజమానులు అయ్యారు. అయితే తమ విజయం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ప​‍్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగే వరకు ఇద్దరు ‘తగ్గెదేలే’ అన్నట్టుగా వ్యవహరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా తమ గళం విప్పడం మాత్రం ఆగలేదు. ఇందుకు ఉదాహారణగా అనేక ఘటనలు ఉన్నాయి. 

2004లో జరిగిన వీరిద్దరు ఓ రెస్టారెంట్‌లో కలిసి స్పేస్‌ గురించి సీరియస్‌గా చర్చించారు. ఇలా ఇద్దరు దిగ్గజాలు కలిసున్న ఫోటోను ఇండియన్‌ బిజినెస్‌ మ్యాగ్నెట్‌, ఆర్పీజీ గ్రూపు ఎండీ హార్ష్‌ గోయెంకా ట్వీట్‌ చేశాడు. ఆ ఫోటోలో ఈలాన్‌మస్క్‌, జెఫ్‌ బేజోస్‌లిద్దరు ఉన్నారు. వీరిద్దరి మధ్య పసుపు రంగులో విరబూసిన ఓ టులిప్‌ పువ్వు కూడా ఉంది. ఈ ఫోటోను వర్ణిస్తూ హార్ష్‌.. ది మోస్ట్‌ ఇంపార్టెంట్‌ టూ లిప్స్‌ ఇన్‌ ది వరల్డ్‌ అంటూ ఆసక్తికరంగా కామెంట్‌ జోడించారు. నెటిజన్లు సైతం భారీ ఎత్తున ఈ ఫోటోకు తమ స్పందన తెలుపుతున్నారు. 

చదవండి: హెచ్‌ఆర్‌ ఎంతో ప్రతిభావంతులు.. కానీ జీతం దగ్గర మాత్రం..

మరిన్ని వార్తలు