అమేజింగ్‌ హోటల్‌! హర్ష్‌గోయెంకా పోస్ట్‌ చేసిన హోటల్‌, ఎలా ఉందో చూడండి

11 Oct, 2021 13:07 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌గోయెంకా అద్భుతమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చారు. ఉరుకులపరుగుల జీవితం నుంచి దూరంగా వెళ్లి కాసేపు పక్షులా స్వేచ్ఛగా బతికేయాలని అనుకునేవాళ్లకి అనువైన ఓ హోటల్‌ని పరిచయం చేశారు. 

క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్‌ హోటల్‌ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో అధునాతన సౌకర్యాలతో గదులు, లాంజ్‌లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద గూళ్ల తరహాలో ఉన్న గదులను చేరుకునేందుకు చెట్లపైనే వేలాడే వుడెన్‌ బ్రిడ్జీలను ఏర్పాటు చేశారు. వెలిజ్‌ ఆర్కిటెక్టో అనే వ్యక్తి ఈ హోటళ్లను డిజైన్‌ చేశారు. ప్రశాంతతకి స్వర్గథామంగా ఈ హోటళ్లని స్థానికంగా పేర్కొంటారు. 


 

చదవండి : 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం?

మరిన్ని వార్తలు