Demonetization: పెద్దనోట్ల రద్దుపై హార్వర్డ్‌ కీలక వ్యాఖ్యలు, మరి ఆర్బీఐ ఏమందంటే..!

8 Nov, 2021 16:13 IST|Sakshi

పెద్దనోట్ల రద్దు నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016 నవంబర్‌ 8న అప‍్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.1000, రూ.500 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దు చేసిన ఆ రెండు పెద్దనోట్లను డిసెంబర్‌ 30వ తేదీలోపల ప్రజలు బ్యాంకుల్లో జమ చేసి  రూ.2000,రూ.500కొత్త పెద్ద నోట్లను తీసుకోవచ్చని గడువు విధించారు. అయితే కేంద్రం ఈ నిర్ణయంపై తీసుకొని 5ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

డిజిటల్‌ ట్రాన్సాక్షన్లు పెరిగిపోయాయి
కేంద్రం తీసుకున్న డీమానిటైజేషన్‌ కారణంగా దేశంలో డిజిటల్‌ లావాదేవీలు మరింత పెరిగినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ముఖ్యంగా యువత డిజిటల్‌ ట్రాన‍్సాక్షన్ లలో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు జరిగి గడించిన రెండేళ్లైనా యువత డిజిటల్‌ ట్రాన్సాక్షన్లు చేశారే తప‍్పా నగదు చెల్లింపులు జరపలేదని పేర్కొంది. నవంబర్ 8, 2016న డీమానిటైజేషన్‌ ప్రభావంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాయని, అదే సమయంలో సాంప్రదాయ ట్రాన్సాక్షన్‌లు తగ్గాయని,డిజిటల్ లావాదేవీలు 2017 నుండి స్థాయిలు, వృద్ధి రేటులో సాంప్రదాయ లావాదేవీలను స్థిరంగా అధిగమించినట్లు తేలింది.  

ఆర్బీఐ నివేదిక 
ఇక,ఆర్బీఐ నివేదిక ప్రకారం..నోట్ల రద్దు దేశాన్ని తక్కువ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చినట్లు తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2014-15 కంటే 14.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రేటు ప్రకారం, 2020-21 చివరి నాటికి చెలామణిలో ఉన్న నోట్లు రూ.32.62 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే, 2021 చివరి నాటికి ఇది చాలా తక్కువగా రూ.28.26 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది.

చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!

మరిన్ని వార్తలు