హావెల్స్‌ లాభం రూ.243 కోట్లు

21 Jul, 2022 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ గృహోపకరణాల కంపెనీ హావెల్స్‌ ఇండియా జూన్‌ త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. రూ.243 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ప్రకటించింది. కమోడిటీల ధరలు (ముడి సరుకులు) పెరిగిపోవడంతో మార్జిన్లు గణనీయంగా ప్రభావితమైనట్టు కంపెనీ తెలిపింది.

ఫలితంగా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.236 కోట్లతో పోలిస్తే కేవలం 3 శాతం వృద్ధికి పరిమితమైంది. ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.4,244 కోట్లకు చేరింది. స్విచ్‌గేర్ల విభాగం నుంచి ఆదాయం 37 శాతం పెరిగి రూ.517 కోట్లుగా, కేబుల్స్‌ విభాగం ఆదాయం 48 శాతం పెరిగి రూ.1,193 కోట్ల చొప్పున నమోదైంది.

ఇక లైటింగ్‌ అండ్‌ ఫిక్సర్స్‌ ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.374 కోట్లుగా ఉంది. ఎలక్ట్రికల్‌ కన్జ్యూమర్‌ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.839 కోట్లకు చేరింది. లయడ్స్‌ కన్జ్యూమర్‌ నుంచి ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ.1,094 కోట్లుగా నమోదైంది.    

మరిన్ని వార్తలు