టెక్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ చేతికి స్విట్జర్లాండ్‌ కంపెనీ!

10 May, 2022 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కాన్‌ఫినాలేను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. అయితే డీల్‌ విలువను వెల్లడించలేదు. 

స్విట్జర్లాండ్‌ కంపెనీ కొనుగోలుకి యూకే అనుబంధ సంస్థ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2012లో ఏర్పాటైన కాన్‌ఫినాలే బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలలో ఐటీ కన్సల్టింగ్‌ సేవలందిస్తోంది. ఈ వ్యూహాత్మక కొనుగోలుతో అవలాక్‌ కన్సల్టింగ్, అమలు, నిర్వహణ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి ద్వారా గ్లోబల్‌ వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో విస్తరించనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలియజేసింది.

అవలాక్‌ ప్రీమియం ఇంప్లిమెంటేషన్‌ పార్టనర్‌ టైటిల్‌ పొందిన నాలుగు గ్లోబల్‌ సంస్థలలో కాన్‌ఫినాలే ఒకటని ఈ సందర్భంగా వెల్లడించింది. బ్యాంకింగ్‌ నైపుణ్యానికి సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యం జతకావలసిన అవసరమున్నదని బలంగా విశ్వసిస్తున్నట్లు కాన్‌ఫినాలే సీఈవో రోలండ్‌ స్టాబ్‌ పేర్కొన్నారు. ఇందుకు హెచ్‌సీఎల్‌ టెక్‌ పరిపూర్ణమైన భాగస్వామి అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు