HCL Technologies: శ్రీలంక ఉద్యోగుల పనితీరు భేష్‌! హెచ్‌సీఎల్‌ ప్రశంసల వర్షం!

14 Jul, 2022 08:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో వ్యాపార కార్యకలాపాల కొనసాగింపునకు తగిన ప్రణాళికలున్నట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది.

అదనపు పనిభారాన్ని నిర్వహించేందుకు ఇండియా, తదితర ప్రాంతాలలోని ఉద్యోగులకు అవసరమైనంత అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలియజేసింది. శ్రీలంకలో కంపెనీ తరఫున 1,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ సమస్యలున్నప్పటికీ సర్వీసులు కొనసాగిస్తున్నట్లు కంపెనీ సీఈవో విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఇందుకు మద్దతుగా దేశీ బృంద సభ్యులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సవాళ్ల నేపథ్యంలోనూ శ్రీలంకలోని ఉద్యోగులు సక్రమంగా బాధ్యతలు నెరవేరుస్తున్నట్లు ప్రశంసించారు.   

మరిన్ని వార్తలు