హెచ్‌సీఎల్‌ టెక్‌ కొత్త లోగో

27 Sep, 2022 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నూతన లోగోను, బ్రాండ్‌ ఐడెంటిటీని విడుదల చేసింది. క్లయింట్లు, ప్రజలు, కమ్యూనిటీల విషయంలో కంపెనీ వైఖరిని ప్రతిబింబించే విధంగా ‘సూపర్‌ చార్జింగ్‌ ప్రోగ్రెస్‌’ అంటూ లోగో పక్కన క్యాప్షన్‌ను పెట్టింది. లోగోలో రాకెట్‌ సింబల్‌ను చేర్చింది. నిత్యం తమ క్లయింట్ల డిజిటల్‌ పరివర్తనాన్ని వేగవంతం చేసే విధంగా కొత్త లోగోకు రూపకల్పన చేసినట్టు కంపెనీ తెలిపింది.

చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్‌ కార్డు కట్‌!

మరిన్ని వార్తలు