హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభం రూ.364 కోట్లు

20 Oct, 2022 07:42 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలు అందించే హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.364 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.344 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ.649 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.608 కోట్లుగా ఉంది.

ఈ సంస్థ నిర్వహణలోని సగటు ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.4.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిర్వహణ ఆస్తులు రూ.4.38 లక్షల కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా తగ్గాయి. మార్కెట్‌ వాటా 11 శాతం కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,960 వద్ద ముగిసింది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

మరిన్ని వార్తలు