HDFC Bank: డెబిట్‌కార్డు లేకుండా డబ్బులను ఇలా విత్‌ డ్రా చేయండి..!

29 Jul, 2021 17:45 IST|Sakshi

సాధారణంగా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే కచ్చితంగా డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డును ఉపయోగించాల్సిందే. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డు లేకుండానే నగదు విత్‌ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు సురక్షితంగా డెబిట్‌ కార్డు లేకుండానే ఎటీఎం నుంచి నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చును. తన ఖాతాదారులకు కార్డ్‌లెస్‌ క్యాష్‌ను అన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి 24/7 సేవలను అందిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ట్వీటర్‌లో పేర్కొంది. 

ఏటీఎమ్‌లో కార్డ్‌లెస్‌ క్యాష్‌ను ఇలా విత్‌ డ్రా చేయండి..!

  • మీకు దగ్గరలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎమ్‌ దగ్గరకు వెళ్లండి. మీకు ఏటీఎమ్‌ మిషన్‌పై చూపిస్తోన్న కార్డ్‌లెస్‌ క్యాష్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయండి. 
  • తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. 
  • మీ ఖాతాతో రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
  • మీ నంబర్‌ ఎంటర్‌ చేయగానే మీకు ఓటీపీ పంపినట్లు మెసేజ్‌ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయండి.
  • మీకు తొమ్మిది అంకెల ఆర్డర్‌ ఐడీ వస్తుంది. తరువాత ట్రాన్సక్షన్‌ అమౌంట్‌ను ఎంటర్‌చేయాలి.
  • వివరాలను ధృవీకరించిన తర్వాత ఏటీఎమ్‌ నుంచి నగదు చెల్లించబడుతుంది.

మరిన్ని వార్తలు