హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో భాగస్వామ్యం

8 Oct, 2020 05:57 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసరమైన వెంటనే ఈ లోన్‌ను మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చు. చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో, ఎండీ ఆదిత్య పురి బుధవారం మీడియాకు తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక రంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభన కామినేని తెలిపారు.

మరిన్ని వార్తలు