హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు భారీ షాక్‌!

9 May, 2023 11:31 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన ఖాతాదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. ఎంపిక చేసిన టెన్యూర్‌ కాలానికి 15 బేసిస్‌ పాయింట్ల మేర ఎంసీఎల్‌ఆర్‌( (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్ల )ను పెంచింది. పెంచిన ఈ రేట్లు మే 8 నుంచే అమల్లోకి వచ్చాయి. 

తాజాగా పెరిగిన ఈ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోని పర‍్సనల్‌, వెహికల్‌ లోన్స్‌ పాటు ఇతర రుణాలు తీసుకున్న ఖాతాదారులు నెలనెలా చెల్లించే ఈఎంఐలు భారం కానున్నాయి.

ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఓవర్‌ నైట్‌ ఎంసీఎల్‌ ఆర్‌ రేటు 7.95 శాతం, ఒక నెల టెన్యూర్‌ కాలానికి 8.10శాతం, 3 నెలల టెన్యూర్‌ కాలానికి 8.40శాతం, 6 నెలల టెన్యూర్‌ కాలానికి 8.80శాతం, ఏడాది టెన్యూర్‌ కాలానికి 9.05 శాతం, రెండు సంవత్సరాల టెన్యూర్‌ కాలానికి 9.10 శాతం, 3ఏళ్ల టెన్యూర్‌ కాలానికి 9.20శాతం విధిస్తుంది. 

మరిన్ని వార్తలు