బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌!

15 Jan, 2022 16:04 IST|Sakshi

బ్యాంకులో మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇంట్రస్ట్‌ రేట్లు పెంచుతూ ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా దారులు వడ్డీరేట్ల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన ఆ ఇంటస్ట్ర్‌ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం? 

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్ డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్‌డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు తర్వాత  వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంటుంది.  

పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా..,రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి.ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ పొందేందుకు కనీస వ్యవధి 7 రోజులు. వ‌డ్డీ ఒక సంవ‌త్స‌రంలోని రోజుల సంఖ్య ఆధారంగా లెక్కించబడుతుంది. లీపు సంవత్సరంలో వడ్డీ 366 రోజులకు లెక్కించబడుతుంది, సాధారణ సంవత్సరంలో వడ్డీ 365 రోజులకు లెక్కించబడుతుంది. కాగా, పెరిగిన వడ్డీ రేట్లపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

చదవండి: ఈ టిప్స్‌ పాటిస్తే.. మీ ఆధార్‌ కార్డు సేఫ్‌..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే

మరిన్ని వార్తలు