సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

7 Feb, 2023 17:26 IST|Sakshi

ఓ వైపు ఆర్ధిక మాద్యం.. మరోవైపు బ్యాంకులు పెంచుతున్న వడ్డీ రేట్లు సామాన్యులకు భారంగా మారాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లబ్ధిదారులకు ఇచ్చే లోన్‌లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు తెలిపారు. 

ఇక హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్ల పెరిగాయి. దీంతో ప్రస్తుతం మొత్తం ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు 8.60 శాతంగా ఉన్నాయి. నెల వ్యవధి కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు 8.60శాతం, మూడు నెలల టెన్యూర్‌ కాలానికి 8.65శాతం, ఆరునెలల కాలానికి 8.75శాతం, ఏడాది కాలానికి కన్జ్యూమర్‌ లోన్స్‌ 8.85శాతం నుంచి 8.90శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్‌ కాలానికి 9శాతం, మూడేళ్ల టెన్యూర్‌ కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు 9.10శాతంగా ఉన్నాయి.   

కాగా, గత  9 నెలలుగా పెరుగుతోన్న వడ్డీరేట్ల మోతకు ఈసారి కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) ఆర్థిక రంగ వృద‍్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఆర్‌బీఐ సమావేశంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 25 బేసిస్‌ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు