HDFC: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?

8 Aug, 2023 10:24 IST|Sakshi

HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్‌తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నెలకు రూ. 1.62 కోట్లు అద్దె..
నివేదికల ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!

ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా..
దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!

గత కొన్ని రోజులకు ముందు హొసింగ్​ ఫైనాన్స్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ (HDFC) ప్రైవేట్‌ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు