హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌–లులు భాగస్వామ్యం

23 Feb, 2023 06:21 IST|Sakshi

తిరువనంతపురం: ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యూఏఈకి చెందిన లులు ఎక్సే్చంజ్‌ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు భారత్, గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) ప్రాంతంలో సీమాంతర చెల్లింపులను బలోపేతం చేస్తాయి.

తొలి దశలో రెమిట్‌నౌ2ఇండియా సేవలను హెచ్‌డీఎఫ్‌సీ అందుబాటులోకి తేనుంది. యూఏఈ నుంచి కస్టమర్లు భారత్‌లోని ఏదేని బ్యాంక్‌ ఖాతాకు ఐఎంపీఎస్, నెఫ్ట్‌ విధానంలో హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్‌ బ్యాంకింగ్‌ వేదికల ద్వారా నగదు పంపవచ్చు. భారత్‌లో లులు ఫారెక్స్, లులు ఫిన్‌సర్వ్‌ కంపెనీల బలోపేతానికి సైతం ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బ్యాంక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు