సీబీడీసీ పైలట్‌ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు

14 Jul, 2023 06:18 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడి

ముంబై: అధికారిక సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించినట్లు వివరించింది.

ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్‌ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేమెంట్స్‌ విభాగం హెడ్‌ పరాగ్‌ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్‌ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ టి. రబి శంకర్‌ ఇటీవలే వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు