తెలుగు రాష్ట్రాల్లో 179 కొత్త శాఖలు

7 Oct, 2022 01:17 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రణాళికలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 6–9 నెలల్లో కొత్తగా 179 శాఖలు ఏర్పాటు చేయనుంది. వీటిలో 90 తెలంగాణలో, 89 ఆంధ్రప్రదేశ్‌లో ఉండనున్నాయి. ఇందుకోసం 5,000 మంది సిబ్బందిని బ్యాంక్‌ తీసుకోనుంది. వ్యాపారవర్గాల కోసం రూపొందించిన స్మార్ట్‌హబ్‌ వ్యాపార్‌ యాప్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్యాంక్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ (దక్షిణాది) తరుణ్‌ చౌదరి గురువారం ఈ విషయాలు తెలిపారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 588 శాఖలు ఉన్నట్లు చెప్పారు. పండుగ సీజన్‌లో 10,000 రకాల పైచిలుకు ఆఫర్లు కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, స్మార్ట్‌హబ్‌ యాప్‌తో చెల్లింపులు, బ్యాంకింగ్‌ సర్వీసులు  పొందడం వ్యాపార వర్గాలకు సులభతరం అవుతుందన్నారు. గతేడాది జూలైలో ప్రయోగాత్మకంగా యాప్‌ను ప్రవేశపెట్టామని, ఈ నెలాఖరు నాటికి యూజర్ల సంఖ్య 10 లక్షలకు చేరుకోనుందని చౌదరి తెలిపారు. 

మరిన్ని వార్తలు