Hdfc Bank Q1 Results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 21 శాతం అప్‌

18 Jul, 2022 18:25 IST|Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది.  స్టాండలోన్‌ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 21 శాతం పెరిగి రూ.9,579 కోట్లుగా నమోదైంది. కానీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.10,055 కోట్లతో పోల్చినప్పుడు (సీక్వెన్షియల్‌గా) కొంత తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం వృద్ధితో రూ.19,481 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం సైతం 35 శాతం వృద్ధిని చూపించి రూ.7,700 కోట్లకు దూసుకుపోయింది.

ఆస్తుల నాణ్యత 
స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు/ఎన్‌పీఏలు) జూన్‌ చివరికి 1.28 శాతానికి మెరుగుపడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 1.47 శాతంగా ఉన్నాయి. 

రుణాల్లో వృద్ధి 
కార్పొరేట్, హోల్‌సేల్‌ రుణాల్లో వృద్ధి 15.7 శాతానికి పరిమితం కాగా, రిటైల్‌ రుణాల్లో 21.7% వృద్ధి నమోదైంది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా రుణాల్లో 28.9 శాతం వృద్ధి సాధ్యమైంది. 

చదవండి: Google Play Store: 8 యాప్‌లను డిలీట్‌ చేసిన గూగుల్‌.. మీరు చేయకపోతే డేంజరే!

మరిన్ని వార్తలు