హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాల్లో 21.5 శాతం వృద్ధి

5 Jul, 2022 09:28 IST|Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాల్లో మంచి వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో రుణ పుస్తకం 21.5 శాతం వృద్ధితో రూ.13,95,000 కోట్లకు చేరినట్టు బ్యాంకు ప్రకటించింది. అంతక్రితం ఏడాది జూన్‌ చివరికి రుణ పుస్తకం రూ.11,47,700 కోట్లుగా ఉంది. డిపాజిట్లు రూ.16,05,000 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది జూన్‌ నాటికి డిపాజిట్లు రూ.13,45,800 కోట్లతో పోలిస్తే 19.3 శాతం వృద్ధి నమోదైంది. మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో గృహ రుణ ఒప్పందం కింద జూన్‌ త్రైమాసికంలో రూ.9,553 కోట్ల రుణాలను కొనుగోలు చేసినట్టు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ విలీనం కానుండడం తెలిసిందే. విలీనం అనంతరం ఏర్పడే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.18 లక్షల కోట్ల రుణ ఆస్తులతో ఉండనుంది. విలీనం మరో ఏడాదికి పైగా పట్టే అవకాశాలున్నాయి.  

మరిన్ని వార్తలు