వ్యాజ్యాలపై హెచ్‌డీఎఫ్‌సీ వివరణ

24 Sep, 2020 15:15 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రైవేటురంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ అమెరికాకు చెందిన న్యాయ సంస్థల వ్యాజ్యాలపై వివరణ ఇచ్చింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్‌ లా కంపెనీ దాఖలు చేసిన క్లాస్ ‌యాక్షన్‌ వ్యాజ్యంతోపాటు, తమ బ్యాంకు ఉద్యోగులపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించింది. వీటిపై తాము న్యాయ పోరాటం చేయనున్నామని స్పష్టం చేసింది. నిజాలను దాచిపెట్టి, తప్పుడు ప్రకటనలతో వాటాదారుల నష్టాలకు కారణమైందన్న ఆరోపణలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. దీనిపై 2021 ప్రారంభంలో తమ స్పందన తెలియజేయాలని భావిస్తున్నట్టు రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం ఇంతకుమించి వివరాలను అందించలేమని పేర్కొంది.  (హెచ్‌డీఎఫ్‌సీకు భారీ షాక్)

కాగా పొటెన్షియల్‌ సెక్యూరిటీ క్లెయిమ్స్‌పై షేరు హోల్డర్స్‌ తరపున విచారణ ప్రారంభించినట్లు రోసన్‌ లా గత నెలలో తెలిపింది. వాహన రుణాల టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్లు  తెలిపింది. 2015 నుండి 2019 బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్‌ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో బ్యాంకు సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు దీనికి మద్దతు పలకాలని కోరింది. మరోవైపు న్యూయార్క్ లోని మరో లా సంస్థ  పోమెరాంట్జ్  కూడా హెచ్‌డీఎఫ్‌సీ అవుట్‌గోయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి, సీఈఓగా బాధ్యతలను చేపట్టనున్న శశిధర్ జగదీషన్, కంపెనీ కార్యదర్శి సంతోష్ హల్దంకర్‌పై లా సూట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు