ప్రాప్‌టెక్‌ స్టార్టప్‌లకు హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ దన్ను

22 Sep, 2022 07:38 IST|Sakshi

ముంబై: ప్రాపర్టీ టెక్నాలజీ స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్, ఇన్వెస్ట్‌ ఇండియా ప్రత్యేక ప్లాట్‌ఫాం ఆవిష్కరించాయి. అఫోర్టబుల్‌ హౌసింగ్‌కు సంబంధించి నిర్మాణం, అమ్మకాలు, ఫిన్‌టెక్, అంశాల్లో కొత్త ఆవిష్కరణలను వెలికితీసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ రియల్‌ ఎస్టేట్‌ టెక్‌ ఇన్నోవేటర్స్‌ 2022 వేదికను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ విపుల్‌ రుంగ్టా తెలిపారు.

దీని ద్వారా మూడు అత్యంత వినూత్న కంపెనీలు లేదా సొల్యూషన్స్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగం అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఇన్నోవేటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. దీనికి అనరాక్, సెకోయా, మ్యాట్రిక్స్‌ పార్ట్‌నర్స్, యాక్సెల్‌ తదితర సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి.

చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే!

మరిన్ని వార్తలు