హెచ్‌డీఎఫ్‌సీ షాక్‌.. హోంలోన్లు ఇకపై భారం

7 May, 2022 14:34 IST|Sakshi

దేశంలో హౌసింగ్‌ ఫైనాన్స్‌లో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ హోంలోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచింది. ఇటీవల రెపోరేటును రిజర్వ్‌బ్యాంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (ఆర్‌పీఎల్‌ఆర్‌)ను 30 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగా వివిధ స్లాబుల్లో హోంలోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈ పెంపు 2022 మే 9 నుంచి అమల్లోకి రానుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయంతో కొత్త రుణాలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న రుణాలపై కూడా వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఆర్బీఐ రెపోరేటు పెంచడానాకి ముందు పలు బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ బేసిక్‌ పాయింట్లను పెంచడం ద్వారా పరోక్ష పద్దతిలో ఇప్పటికే వడ్డీరేట్లు పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం రియాల్టీ రంగంపై పడనుంది.

చదవండి: నాలుగేళ్ల తర్వాత..సామాన్యులకు ఆర్బీఐ భారీ షాక్‌!

మరిన్ని వార్తలు