హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ రేటు 6.7 శాతానికి డౌన్‌ 

22 Sep, 2021 05:00 IST|Sakshi

పండుగల సీజన్‌ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యం

అక్టోబర్‌ 31 వరకూ అమలు  

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో గృహ రుణ మార్కెట్‌లో తన వాటా పెంపు లక్ష్యంగా హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. తద్వారా ఇప్పటికే ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్న ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వరుసలో నిలిచింది.  ముఖ్యాంశాలు చూస్తే... 

అన్ని గృహ రుణ శ్లాబ్‌లకు, 800 ఆపైన క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి 6.7%  వడ్డీ ఆఫర్‌ వర్తిస్తుంది.  
సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.  
ఇంతక్రితం వేతన జీవులకు క్రెడిట్‌ స్కోర్‌ 800 దాటిఉండి, తీసుకునే రుణం రూ.75 లక్షలపైన ఉంటే 7.15 శాతానికి వడ్డీరేటు లభించేది. స్వయం ఉపాధి పొందుతున్న వారి విషయంలో ఈ రేటు 7.30 శాతంగా ఉండేది. దీని ప్రకారం ఈ 2 కేటగిరీల్లో తాజాగా రుణ రేటు వరుసగా 0.45%, 0.60% తగ్గినట్లయ్యింది. 
క్రెడిట్‌ స్కోర్‌ అధికంగా ఉండే వారికి వర్తించే తాజా ఆఫర్‌ అక్టోబర్‌ 31 వరకూ అందుబాటులో ఉంటుంది.  
అత్యధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70% నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇక బ్యాంక్‌ బ్యాంక్‌ ఆఫ్‌  బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75% వద్ద ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించింది. అదేవిధంగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్‌ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు