14 నెలల్లోనే ఎక్సైడ్‌ లైఫ్‌ విలీనం పూర్తి

24 Oct, 2022 06:41 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీ విభా పదల్కర్‌

ముంబై: తమ అనుబంధ సంస్థ ఎౖక్సైడ్‌ లైఫ్‌ను రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో విలీనం చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో విభా పదల్కర్‌ తెలిపారు. సకాలంలో అనుమతులు ఇచ్చి తమకు ప్రోత్సాహం, మద్దతుగా నిలిచినందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ)తోపాటు, ఇతర నియంత్రణ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నమోదు చేసినట్టు ప్రకటించారు. ఎక్సైడ్‌ లైఫ్‌ విలీనానికి ముందు ఏపీఈ 11% వృద్ధి సాధించినట్టు చెప్పారు. పరిశ్రమకు అనుగుణంగానే తమ పనితీరు ఉందంటూ, లిస్టెడ్‌ కంపెనీలతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించామని, మార్కెట్‌ వాటాను 14.6 శాతంనుంచి 15%పెంచుకున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు