మెరుగైన రాబడుల కోసం.. హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌

21 Nov, 2022 07:19 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ పేరిట కొత్త ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌వో నవంబర్‌ 25తో ముగుస్తుంది. సానుకూల పరిస్థితుల్లోకి మళ్లుతున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందించేందుకు ఈ ఫండ్‌ కృషి చేస్తుంది.

వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీల ఆదాయ వృద్ధిపరంగాను, అటు వేల్యుయేషన్ల వృద్ధిపరంగాను ఒనగూరే ప్రయోజనాలను అందుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ నవ్‌నీత్‌ మునోత్‌ తెలిపారు. మూడేళ్లు అంతకు పైబడిన వ్యవధి కోసం ఇన్వెస్ట్‌ చేయదల్చుకునే వారికి ఇది అనువైనదిగా ఉండనుంది. 

చదవండి: ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు: రూల్స్‌​​ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్‌ చేయాలి!

మరిన్ని వార్తలు