హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 675 బ్రాంచ్‌ల ఏర్పాటుకు సిద్ధం!

6 May, 2023 13:56 IST|Sakshi

ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్‌డీఎఫ్‌సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. 

(ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!)

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్‌డీఎఫ్‌సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

మరిన్ని వార్తలు