మనసును హత్తుకునే, గుండె బరువెక్కించే దీపావళి యాడ్స్‌

3 Nov, 2021 13:37 IST|Sakshi

దీపావళి పండగ అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బిజినెస్‌ సెక్టార్‌లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. స్టాక్‌మార్కెట్‌లో ప్రత్యేకంగా ముహురత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. దాదాపు అన్ని వ్యాపార సంస్థలులు ధమాకా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే మనసును ఆకట్టుకునేలా యాడ్స్‌ రూపొందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో ఈసారి వచ్చిన కొన్ని ప్రకటనలు మనసును హత్తుకునేలా.. గుండె తడిని పెంచేలా.. ఉ‍న్నాయి. భాషతో సంబంధం లేకుండా భావంతో కట్టిపడేసేలా వాటిని రూపొందించారు. పండగ వేళ మీరు వాటిని చూడండి.

వీటి తీరే వేరు
సాధారణంగా అన్ని యాడ్స్‌ ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్టు గురించి విపరీతంగా ప్రమోట్‌ చేస్తున్నట్టుగా తయారవుతాయి. కానీ దీపావళి యాడ్స్‌ అలా కాదు పూర్తిగా భావోద్వేగంగా ఉంటాయి. బ్రాండ్‌, ప్రొడక్ట్‌ ప్రమోషన్‌ అనేది అంతర్లీనంగా ఉంటూ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే ఏళ్లు గడిచినా సరే వాటిని మరిచిపోవడం కష్టం. 

సేల్స్‌మేన్‌ కళ్లలో ఆనందం
ఇండియన్‌ ఆయిల్‌ యాడ్‌లో .. దీపావళి పండగ సందర్భంగా ఓ స్వీట్‌ షాప్‌ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ షాప్‌ యజమాని వచ్చిన కస్టమర్లందరికీ టేస్ట్‌ చూడమంటూ కలాకాన్‌ అందిస్తుంటాడు. ఈ షాప్‌లోని సేల్స్‌మేన్‌ చూస్తుండగానే కాంప్లిమెంటరీ స్వీట్‌ మొత్తం అయిపోతుంది. చివరకు షాప్‌ మూసివేసే సమయంలో ఏమైనా స్వీట్‌ మిగిలి ఉందా అని సేల్స్‌మేన్‌ వెతుకుతారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. పండగ వేళ బయటంతా బాణాసంచా వెలుతురుతో సందండి నెలకొంటే సేల్స్‌మ్యాన్‌ ముఖంలో విచారణం నెలకొంటుంది. మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది.

మనసంతా నిరాశతో గుండె బరువెక్కిపోయిన సేల్స్‌మేన్‌ కళ్లలో ఆనందం ఎలా వచ్చింది. ఎవరు ఆ సంతోశానికి కారణమనే అంశాలను ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. చివర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్‌తో యాడ్‌ మరో లెవల్‌కి వెళ్లిపోతుంది. 

దీపావళి యాడ్స్‌కి స్పెషల్‌ ట్రెండ్‌ని క్రియేట్‌ని చేసి వాటిలో రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్‌పీ ప్రింటర్స్‌ యాడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఓల్డ్‌ అడ్వెర్‌టైజ్‌మెంట్‌కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈసారి కూడా హెచ్‌పీ సంస్థ యాడ్‌ను రెడీ చేసింది.

కొన్ని బంధాలకు లేబుళ్లు అక్కర్లేదు అంటూ అమెజాన్‌ రూపొందించిన యాడ్‌ తప్పకుండా ఆకట్టుకుంటుంది.

దీపావళి రోజున ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తీసుకెళ్లిన కొడుకుతో తండ్రి వాదులటతో ప్రారంభమయ్యే ఎల్‌ అండ్‌ టీ యాడ్‌ ఎండింగ్‌లో ఇ‍చ్చే ట్విస్ట్‌తో మరో లెవల్‌కి చేరుకుంటుంది.  

వృద్దాప్యంలో చాదస్తం ఎక్కువైన భర్త, అతనితో వేగలేక పోతున్న భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెబుతూ ఏయూ బ్యాంక్‌ రూపొందించిన యాడ్‌ కూడా ఆకట్టుకుంటుంది.

మరిన్ని వార్తలు