ఈవీ కంపెనీలకు నితిన్‌ గడ్కరీ వార్నింగ్‌!

21 Apr, 2022 20:25 IST|Sakshi

ఎలక్ట‍్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థలకు కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్‌ గడ్కరీ వార్నింగ్‌ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అగ్నిప్రమాదానికి గురవుతున్నాయి. పలువురు ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఈనేపథ్యంలో వరుస ప్రమాదాలపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఈవీ వెహిలక్స్‌ తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. లేదంటే సదరు ఆటోమొబైల్‌ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వరుస ట్వీట్‌లు చేశారు.   

"గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ బైక్‌ ప్రమాదాలకు సంబంధించి అనేక దుర్ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం అత్యంత దురదృష్టకరం" అని గడ్కరీ ట్వీట్లలో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలి.

వాహనాల తయారీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించడమే కాదు.. లోపమున్న వాహనాల్ని వెనక్కి రప్పించాల్సి ఉంటుందని గడ్కరీ సూచించారు. ఇప్పటికే తయారు చేసిన వెహికల్స్‌ లోపాల్ని గుర్తిస్తే వాటిని వెంటనే సరిచేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.

చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌..కేంద్రం సంచలన నిర్ణయం!

మరిన్ని వార్తలు