మస్క్‌ చేతికి ట్విటర్‌..డీల్‌ నేపథ్యంలో జరిగిన ఆసక్తికర విషయాలు!

26 Apr, 2022 09:12 IST|Sakshi

ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిగ్గా మారారు. 6నెలలుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న మస్క్‌ ఓ ఇంటర్వ్యూలో..తాను ఉండేందుకు ఇల్లు కూడా లేదని, ఫ్రెండ్స్‌ ఇళ్లల్లో ఉంటున్నట్లు తెలిపారు. సీన్‌ కట్‌ చేస్తే 44బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానలకు మరింత షాక్‌ గురిచేశారు. అంతేనా మస్క్‌..ట‍్విటర్‌ కొనుగోలు సమయంలో ఇలాంటి ఆసక్తికర పరిణామాలు అనేకం జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ట్విటర్‌ను కొనుగోలు చేసే నేపథ్యంలో ఎలన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌లో 84మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న మస్క్‌.."స్వేచ్ఛగా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి పునాది. అలాంటి వేదికకు అనువుగా ఉన్న ట్విటర్‌లో మానవాళి భవిష్యత్తు గురించి చర్చ జరుగుతుంది." అని అన్నారు.  

"కొత్త ఫీచర్‌లతో ట్విటర్‌ను మెరుగుపరచాలని అనుకుంటున్నాను. అందుకే ట్విటర్‌పై యూజర్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు అల్గారిథమ్‌లను ఓపెన్ సోర్స్ చేయడం అంటే ఉదాహరణకు ట్విటర్‌లో ఎడిట్‌ బటన్‌ అనే ఆప్షన్‌ లేదు. ఈ ఆప్షన్‌ లేకపోవడం వల్ల..యూజర్‌ తప్పుగా ట్విట్‌ చేస్తే..అది అలాగే ఉంటుంది. మళ్లీ సరిచేయడం కుదరదు. కావాలంటే ఆ ట్విట్‌ను డిలీట్‌ చేసి..కొత్త ట్విట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలన్‌ మస్క్‌ ఎడిట్‌ బటన్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ట్విటర్‌ యూజర్లకు భారీ ఊరట కలగనుంది.  

ట్విటర్‌ను ఎలన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత..ఆ సంస్థలోని ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో ఎలాంటి కోతలుండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రస్తుత సీఈఓ అనిల్‌ అగర్వాల్‌ తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

మస్క్ 25.5 బిలియన్ల పూర్తి నిబద్ధత కలిగిన రుణం,మార్జిన్ లోన్ (మస్క్‌ దగ్గర ఉన్న షేర్లు, ఇతర ఆస్థుల్ని సెక్యూరిటీగా చూపించి అప్పును పొందడం) ఫైనాన్సింగ్‌ను పొందారు. ఆ రుణం నుంచే ట్విటర్‌కు సుమారు 21.0 బిలియన్ల ఈక్విటీ కమిట్మెంట్‌ను అందించినట్లు ట్విటర్‌ తెలిపిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. 

ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే ట్విటర్‌ను ఎలన్‌ మస్క్‌ దక్కించుకోకుండా ఉండేలా  కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. 

ఎలన్ మస్క్ చేతుల్లోకి ట్విటర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు ట్విటర్ బోర్డ్‌ పాయిజన్‌ పిల్‌ అస్త్రాన్ని ఎలన్‌ మస్క్‌పై ఉపయోగించింది. 

బిజినెస్‌ టెర్మనాలజీలో పాయిజన్‌ పిల్‌ గురించి చెప్పాలంటే ఉదాహరణకు..బలవంతంగా ఒక సంస్థను మరో వ్యక్తి కొనుగోలు చేయకుండా ఉండేలా ఈ పాయిజన్‌ పిల్‌ పద్దతి ఉపయోగపడుతుంది. ఇది అమలు చేస్తే కొత్త వ్యక్తులు 15 శాతానికి మించి సంస్థలో వాటా కొనుగోలు చేసే వీలుండదు. అంతేకాదు ప్రస్తుతమున్న వాటాదారులే తక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆటోమెటిగ్గా కంపెనీ షేర్‌ వ్యాల్యూ పడిపోతుంది. పడి షేర్‌ వ్యాల్యూతో కంపెనీని కొనుగోలు చేసేందుకు కాంపిటీటర్లు వెనుకంజ వేస్తారు. అదే తరహాలో ఎలన్ మస్క్‌పై ట్విటర్‌ ఈ పాయిజన్‌ పిల్‌ అస్త్రాన్ని ఉపయోగించింది. కానీ ఏం లాభం ఎలన్‌ మస్క్‌ మాస్టర్‌ ప్లాన్‌కు ట్విటర్‌ను ఆయనకు అమ్మాల్సి వచ్చింది.

ట్విట‌ర్‌ను ఎలన్‌మస్క్‌ అమ్మేందుకు ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్ల బృందం అంగీకరించింది. డీల్‌కు సంబంధించి పూర్తి స్థాయి లావాదేవీలు ఈ ఏడాదిలోపే పూర్తికానున్నాయి. ఎలన్‌ మస్క్‌ ఒక్కో షేరుకు $54.20 డాలర్లు కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

మరిన్ని వార్తలు